సినిమాల పరంగా, రాజకీయంగా అందించిన సేవలతో ఎన్టీఆర్ చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. జాతికి ఆయన అందించిన సేవలు అనిర్వచనీయమైనవని కొనియాడారు. NTR శత జయంతి సందర్భంగా ఆయన స్మారక నాణేన్ని ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో నాణేన్ని విడుదల చేశారు. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, మరో 5 శాతం జింక్ తో కూడిన మిశ్రమంతో రూ.100 నాణేన్ని హైదరాబాద్ లోని మింట్ తయారు చేసింది.
ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన 20 నిమిషాల వీడియోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ అటెండ్ అయ్యారు. అటు BJP జాతీయ, రాష్ట్ర నేతలతోపాటు TDPకి చెందిన పలువురు MPలు కార్యక్రమంలో పాల్గొన్నారు.