తిరుమల కాలి నడక దారిలో మరో చిరుతపులి బోనులో చిక్కింది. బాలికపై దాడిపై చేసిన ప్రాంతమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలోనే ఇది దొరికింది. దీంతో వారం రోజుల్లో రెండు చిరుతలను అధికారులు పట్టుకుని SV జూపార్క్ కు తరలించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాడుకు చెందిన ఆరేళ్ల బాలికను వన్యమృగం పొట్టనపెట్టుకోవడం.. మరుసటి రోజు కూడా చిరుత కనిపించడంతో నడక మార్గంలో ఫారెస్టు సిబ్బంది బోన్లు ఏర్పాటు చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం పరిసరాల్లో 5 బోన్లు ఉంచారు. గత ఆదివారం అర్థరాత్రి ఒక క్రూరమృగం చిక్కగా.. ఈరోజు ఉదయం మరొకటి బోనుకు దొరికింది.
తిరుమల కాలినడక దారిలో మొత్తం 5 చిరుతలు తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఇప్పటి కే మంగళవారం నాడు వైల్డ్ లైఫ్ మీటింగ్ నిర్వహించగా.. అదే రోజు TTD సైతం సమావేశమైంది. భారీసంఖ్యలో 500 కెమెరాలు అమర్చుతున్నారు.