యువత, మహిళల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ అవే వర్గాలకు వరాలు ప్రకటించారు. జనసేన అధికారంలోకి వస్తే పెద్దయెత్తున ఉపాధి కల్పిస్తామని, వారి ఆలోచనలకు తగ్గట్లు బిజినెస్ చేయాలని ముందుకు వస్తే ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఉమెన్ ఇండస్ట్రియలిస్ట్ ల కోసం కమ్యూనిటీ పరంగా సెగ్మెంట్ కు 500 మందిని ఎంపిక చేసి రూ.10 లక్షల సాయం అందిస్తామన్నారు. మొత్తంగా ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని.. మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యమే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందన్నారు. కేరళ తరహాలో ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తామని, మాతృభాషను నేర్చుకోవాలన్న పవన్… అభివృద్ధి జరగాలంటే జగన్ సర్కారు పోవాలన్నారు.
సర్కారుపై నమ్మకం లేదు
తిరుపతి శ్రీవాణి ట్రస్టులో అక్రమాలు లేవని వైవి సుబ్బారెడ్డి శ్వేతపత్రం విడుదల చేసినా దాన్ని నమ్మేది లేదని, అసలు ప్రభుత్వంపైనే నమ్మకం లేదని పవన్ అన్నారు. 2024లో మీ ప్రభుత్వం ఎలాగూ రాదు.. గోదావరి జిల్లాల్లో YCP ఒక్క సీటూ గెలవకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ జనసేనాని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే జగన్ ప్రభుత్వంలోని లీడర్లపై విచారణ జరిపించి శిక్షపడేలా చేస్తామన్నారు.