
పవన్ కల్యాణ్ మేనియా ఏంటో మరోసారి రుజువైంది. పవన్ ను ఒక్కసారైనా కలుసుకోవాలని వీలైతే షేక్ హ్యాండ్ ఇవ్వాలని కోరుకునే ఫ్యాన్స్ లక్షల్లో ఉంటారు. ఇంతటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగిన యాక్టర్ కమ్ పొలిటీషియన్ దేశంలోనే వెళ్లమీద లెక్కపెట్టొచ్చంటే అతిశయోక్తి కాదేమో. హై రేంజ్ స్టార్ డమ్ కలిగిన పవన్ కల్యాణ్… సరికొత్త రికార్డులు సృష్టించారు. సినిమాల సంగతి అటుంచితే… పాలిటిక్స్ గురించి కాసేపు పక్కనపెడితే… PKకు ఉన్న ఇమేజ్ తారస్థాయికి చేరుకుంది. రెండు రోజుల క్రితం ప్రారంభించిన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్… సోషల్ మీడియాకే రారాజుగా నిలుస్తోంది.
ఫాలోయిజమా… ప్రభం’జనమా’…
కొంతమంది సెలబ్రిటీలకు ఒక మిలియన్ నుంచి 10 మిలియన్ల వ్యూయర్ షిప్ రావడానికి ఎంతో టైం పట్టింది. అది వారి సినిమాలను బట్టి నెలల నుంచి ఏళ్ల దాకా అయిండొచ్చు. కానీ పవన్ తన మార్కును చూపిస్తూ… కేవలం 40 గంటల్లోనే 20 లక్షల(2Million) వ్యూయర్స్ దాటేశారు. ఆల్ టైం గ్రేట్ గా దూసుకుపోతున్న పవన్ ఇన్ స్టా… ‘ఫాలోయిజమా ప్రభంజనమా’ అన్నట్లు కొనసాగుతోంది. సింగిల్ పోస్టు పెట్టకుండానే ఈ స్థాయి రికార్డ్ సెట్ చేసిన ఘనత పవన్ కల్యాణ్ దే.
మోస్ట్ పాపులర్ వీళ్లే…
అత్యధిక ఫాలోవర్స్ కలిగిన స్టార్ గా హిందీ హీరోయిన్ ప్రియాంక చోప్రా 88.4 మిలియన్లతో టాప్ లో ఉండగా… 65.2 మిలియన్లతో అక్షయ్ కుమార్ టాప్-2లో ఉన్నారు. షార్ట్ పీరియడ్ లో అత్యంత ఎక్కువగా ఫాలోవర్స్ కలిగిన సెలబ్రిటీగా పవన్ కల్యాణ్ ట్రెండ్ క్రియేట్ చేశారు. PSPKగా, జనసేనానిగా దూసుకుపోతున్న ఈ సెంట్రాఫ్ అట్రాక్షన్ ను ఫ్యాన్స్ ముద్దుగా.. ‘దటీజ్ PK’ అంటుంటారు. ‘ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో’… జైహింద్! అనే స్లోగన్ చేర్చి ఇన్ స్టాలో దుమ్ము దులుపుతున్నారాయన.
Good Sir