క్రిమినల్స్ ను అణచివేసే ధైర్యం లేనప్పుడు పోలీసులెందుకు అని ప్రశ్నించిన పవన్ కల్యాణ్.. తాను హోంమంత్రినైతే పరిస్థితి వేరేగా ఉంటదని వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పనితీరు, శాంతిభద్రతలపై డిప్యుటీ CM సీరియస్ కామెంట్స్ చేశారు. CMను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని, ఇళ్లల్లోకి వెళ్లి మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారి పట్ల ఖాకీలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ CM యోగి ఆదిత్యనాథ్ తరహాలో చర్యలు తీసుకుంటే గానీ మాట వినరు అని మాట్లాడారు.
30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైతే జగన్ సర్కారు పట్టించుకోలేదని, గత ప్రభుత్వంలో శాంతిభద్రతలు లేవని, ఇప్పుడు ధర్మబద్ధంగా చట్టాలు అమలు చేయాలంటే పోలీసులు పట్టించుకోవడం లేదని పవన్ ఫైర్ అయ్యారు. ‘DGP, కలెక్టర్లు, SPలకు ఒకటే చెబుతున్నా.. మా బంధువండీ, మా రక్తమండీ అని ఎవడైనా చెబితే వాడి తాట తీయండి.. హోంమంత్రి అనితకు ఒకటే చెబుతున్నా.. మీరు మంత్రిగా బాధ్యత తీసుకోండి.. నేను పంచాయతీరాజ్, అటవీశాఖ మంత్రిని.. హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి.. మీరు ఏమీ చేయకుండా ఉంటే ఆ హోంమంత్రి కూడా తీసుకోవాల్సి వస్తుంది..’ అంటూ కోపంగా మాట్లాడారు.