‘ప్రజలు మనకు పట్టం కట్టింది ప్రతీకారాలు(Revenges) తీర్చుకోవడానికి కాదు.. వారికి మంచిగా సేవ(Service) చేయడానికి.. మనల్ని మనస్ఫూర్తిగా నమ్మి అఖండ విజయాన్ని కట్టబెట్టారంటే అత్యుత్తమ పాలన ఇవ్వాలని చెప్పడమే.. గత ప్రభుత్వానికి ఇది అర్థం కాలేదు..’ అని జనసేన(Janasena) అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన భేటీలో ఆయన శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు.
‘భారతదేశంలో అధికారం(Power) లేకుండా పదేళ్ల పాటు పార్టీని నడిపిన దాఖలాల్లేవు.. ఎక్కడైనా ప్రజలు ప్రశ్నిస్తే దాన్ని వేరుగా తీసుకోవద్దు.. వారి ఆగ్రహానికి కారణాలు వెతకండి.. నమ్మకంగా ఓటు వేసిన వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకపోతే అంతే బలంగా నిలదీస్తారని గుర్తు పెట్టుకోండి..’ అంటూ పవన్ తమ MLAలకు హితబోధ చేశారు.