యాక్టర్ అవుతానని జీవితంలో ఎప్పుడూ అనుకోలేదని AP డిప్యూటీ CM పవన్ కల్యాణ్ అన్నారు. అన్న చిరంజీవి వల్లే తమ కుటుంబమంతా ఇలా ఉందని, మెగాస్టార్ తర్వాతే ఎవరైనా అని గుర్తు చేసుకున్నారు. ఆయన వల్లే నటుడినయ్యానని, వకీల్ సాబ్ సినిమాకు వచ్చిన డబ్బులతో జనసేనను నడిపినట్లు తెలిపారు. రాజమండ్రిలో నిర్వహించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ప్రసంగించారు. గేమ్ ఛేంజర్ లో నటించిన దర్శకుడు ఎస్.జె.సూర్యను పొగిడిన పవన్.. ఆయన డైరెక్షన్ ను వదిలేయడం బాధగా ఉందన్నారు.