AP ఉప ముఖ్యమంత్రి(Deputy CM) పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ వల్ల ఇబ్బంది పడ్డ తీరుపై విచారణకు ఆదేశించారు. పెందుర్తిలో పవన్ కాన్వాయ్ వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి పలువురు విద్యార్థులు JEE పరీక్ష మిస్ అయ్యారు. దీని గురించి తెలుసుకున్న డిప్యూటీ CM.. విచారణ జరపాలని విశాఖ పోలీసులను ఆదేశించారు. ట్రాఫిక్ ఎంతసేపు నిలిపేశారు.. ఎగ్జామ్ సెంటర్ల రోడ్లల్లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి.. సర్వీస్ రోడ్లలో ట్రాఫిక్ ఎలా మెయింటెయిన్ చేస్తున్నారు.. కాన్వాయ్ వల్ల అభ్యర్థులు ఎంతసేపు సమయం కోల్పోయారు.. అన్న వివరాల్ని తేల్చాలని పోలీసులకు స్పష్టం చేశారు.