ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ CM పవన్ కల్యాణ్ తనయుడు(Son) ప్రమాదం బారిన పడ్డారు. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. పాఠశాలలో ప్రమాదం జరిగి ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. ఎనిమిదేళ్ల శంకర్ 2017 అక్టోబరు 10న జన్మించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ ఈరోజు సింగపూర్(Singapore) వెళ్తున్నారు. అయితే మన్యం గిరిజనుల్ని కలుసుకుంటానన్న హామీ మేరకు ఆ టూర్ పూర్తి చేసుకునే బయల్దేరతానని ఆయన ప్రకటించారు.