రానున్న ఎలక్షన్లలో TDPతో కలిసే పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇక విడివిడిగా పోటీ చేస్తే సరికాదని, ఓట్లు చీల్చి మళ్లీ YSRCPకి అధికారం కట్టబెట్టే స్థితిలో లేమని అన్నారు. జగన్ ను నమ్ముకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదని, ఫ్యూచర్ లోనూ అలాంటి వారిలో ఏ ఒక్కర్నీ వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. TDP-జనసేనతో BJP కలిసి వస్తుందని నమ్ముతున్నానన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును ములాఖత్ లో భాగంగా పవన్ కలుసుకున్నారు. నందమూరి బాలకృష్ణ, లోకేశ్ తోపాటు బాబును కలుసుకున్న పవన్.. 40 నిమిషాల పాటు ఆయనతో ముచ్చటించారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, ఆయన విజన్ రాష్ట్రానికి అవసరమన్నారు.
రాష్ట్రం బాగుండాలన్నదే జనసేన లక్ష్యమని కానీ APలో అరాచక పాలన కొనసాగుతున్నదన్నారు. అనుభవం ఉన్న లీడర్ కావాలన్న ఉద్దేశంతోనే 2014లో చంద్రబాబుకు మద్దతిచ్చానన్న పవన్.. నేను ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. TDP-జనసేన పొత్తుపై రేపే కార్యాచరణ మొదలుపెడతామని పవన్ తెలిపారు.