తెలంగాణలో క్రిమినల్ పాలిటిక్స్ ఉండవన్న పవన్ కల్యాణ్… తెలంగాణ ఏర్పడటానికి జగన్ కూడా ఒక కారణమే అని అన్నారు. జగన్ వర్గం తెలంగాణ భూములు ఎలా దోచుకున్నదో కళ్లారా చూశానన్న జన సేనాని.. ఆయన అనుచరుల దాడిని తట్టుకోలేనే ఆంధ్రాకు తన్ని తరిమేశారంటూ హాట్ కామెంట్స్ చేశారు. వారాహి మూడో విడత విజయయాత్రలో భాగంగా ఉత్తరాంధ్రలో 10 రోజుల పాటు పర్యటించనున్న పవన్… ఇవాళ వైజాగ్ బహిరంగసభలో మాట్లాడారు. YCP సర్కారుపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వలంటీర్లు నా కుటుంబ సభ్యుల్లాంటివారని, వారిపై తనకు ద్వేషం లేదన్నారు.