
దేశం విడిచి వెళ్లరాదంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను సడలించాలని కోరుతూ ముఖ్యమంత్రి YS జగన్ తోపాటు ఆ పార్టీ MP విజయసాయిరెడ్డి CBI కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. యూకే టూర్ కు అనుమతి ఇవ్వాలంటూ జగన్ అభ్యర్థించగా.. ఐదు దేశాలకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని విజయసాయి కోరారు. తన కుమార్తెను చూసేందుకు యునైటెడ్ కింగ్ డమ్ వెళ్లాల్సి ఉన్నందున ఆంక్షల్ని సడలించాలని పిటిషన్ లో జగన్ కోరారు. అయితే దీనిపై కౌంటర్ దాఖలుకు CBI గడువు కోరింది. దీంతో న్యాయస్థానం.. కేసు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
అటు తనను కూడా ఫారిన్ టూర్ కు అనుమతించాలంటూ MP విజయసాయిరెడ్డి పిటిషన్ లో కోరారు. UK, USA, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లాల్సి ఉన్నందున అందుకు పర్మిషన్ ఇవ్వాలని అభ్యర్థించారు. యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉందని చెప్పగా… ఈ కేసులోనూ CBI కౌంటర్ దాఖలుకు సమయం కోరింది. దీంతో జగన్ కేసు మాదిరిగానే ఈ విచారణను సైతం ఈ నెల 30కి CBI కోర్టు వాయిదా వేసింది.