నారా చంద్రబాబు తనయుడు లోకేశ్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించి పిటిషన్ ను రిజెక్ట్ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41ఏ కింద లోకేశ్ కు CID నోటీసులు జారీ చేసింది. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ఆరుగురు సభ్యుల CID టీమ్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లింది. ఈ విచారణకు లోకేశ్ సహకరించాలని ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసిన సమయంలో హైకోర్టు స్పష్టం చేసింది.
ఇలా TDP నేతలకు వరుసగా కోర్టుల్లో చుక్కెదురవుతున్నది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉండగా… ఇప్పుడు లోకేశ్ ను ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారించబోతున్నారు.