
పల్నాడు జిల్లా వినుకొండలో పరిస్థితి(Situation) సీరియస్ గా మారింది. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. అధికార పార్టీ YCP, ప్రధాన ప్రతిపక్షం TDP కార్యకర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడంతో ఏం చేయాలో పోలీసులకు అర్థం కాలేదు. ఇరు వర్గాలను అక్కణ్నుంచి చెదరగొట్టాలని చూసినా ఫలితం కనిపించలేదు. చేసేదిలేక గాలిలోకి కాల్పులు జరిపారు. ఈరోజు పొద్దున్నుంచి పట్టణంలో ఉద్రిక్త వాతావరణమే ఉంది. ఇందుకు ప్రధాన కారణం మాజీ MLA ఆంజనేయులపై కేసు ఫైల్ కావడమే.
MLA వల్లా బ్రహ్మనాయుడుకు చెందిన ఫ్యాక్టరీలో అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ ఆ స్థలానికి ఆంజనేయులు వెళ్లారు. తమ ఫ్యాక్టరీతోపాటు డెయిరీలోకి కూడా TDP నాయకులు వచ్చి వస్తువులు ఎత్తుకుపోయారంటూ బ్రహ్మనాయుడు కంప్లయింట్ ఇచ్చారు. దీంతో పోలీసులు ఆంజనేయులుపై కేసు పెట్టారు. ఈ కేసులను నిరసిస్తూ TDP ర్యాలీ తీస్తున్న సమయంలో ఎదురుగా MLA బ్రహ్మనాయుడి కారు అటుగా వచ్చింది. ఆ కారుపై దాడికి యత్నించడంతో ఇరువర్గాల మధ్య గొడవ పెరిగి పెద్దదైంది. చివరకు కర్రలు, రాళ్లతో దాడికి దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు.