ఆంధ్రప్రదేశ్ లో అధికారం(Power) చేతులు మారిన తర్వాత TDP-YSRCP మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఆరోపణలు-ప్రత్యారోపణలు కనిపిస్తున్నాయి. తమపై తెలుగుదేశం పార్టీ దాడులకు దిగుతున్నదని YCP ఆరోపిస్తే.. మీరు అధికారంలో ఉన్నట్లు కాదు మేము అంటూ TDP ఎదురుదాడికి దిగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు పార్టీలకు చెందిన కార్యాలయాల(Office) విషయంలో వార్ నడుస్తున్నది.
ఏం జరిగిందంటే…
YCPకి చెందిన భవనాల ఫొటోలు పెట్టి మీవి ప్యాలెస్ లు అంటూ తెలుగుదేశం పార్టీ కామెంట్స్ పెట్టింది. దీనికి ప్రతిగా YCP సైతం TDP బిల్డింగ్స్ ఫొటోలు తమ భవనాల పక్కనే పెట్టి.. మావి ప్యాలెస్ లైతే మీవి గుడిసెలా అంటూ కౌంటరిచ్చింది. ప్యాలెస్ లు, పూరి గుడిసెలు అంటూ రెండు ప్రధాన పార్టీలు పోస్ట్ చేసిన ఫొటోలు మాత్రం పొలిటికల్ హీట్ ను కలిగిస్తున్నాయి.