అధికార తెలుగుదేశం-జనసేన కూటమికి MLC ఎన్నికల్లో షాక్ తగిలింది. ఉత్తరాంధ్రలో కూటమి బలపరిచిన APTF అభ్యర్థి, సిట్టింగ్ MLC రఘువర్మపై PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ టీచర్ స్థానానికి తొలి ప్రాధాన్యత(First Priority) ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. శ్రీనివాసులు నాయుడుకు 12,035 ఓట్లు రాగా.. ఈ విజయంతో ఆయన మూడోసారి శాసనమండలి సభ్యుడిగా అడుగు పెట్టబోతున్నారు. గతంలో ఆయన 2007, 2013 ఎన్నికల్లో గెలుపొందారు. తెలంగాణలో జరిగిన రెండు టీచర్ ఎమ్మెల్సీల్లో ఒక సీటను సైతం PRTU ఎగరేసుకుపోయింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ MLCగా ఆ సంఘం బలపరిచిన అభ్యర్థి పింగలి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు.