ఇప్పటికే దిల్లీలో బిజిబిజీగా BJP అగ్రనేతలతో చర్చలు జరిపిన పవన్ కల్యాణ్.. ఇక ఆంధ్రప్రదేశ్ పార్టీ లీడర్లతోనూ భేటీ అయ్యే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల అంశంపై NDA సమావేశాల సమయంలో క్లారిటీ ఇచ్చిన ఆయనతో తాము భేటీ అవుతామని BJP రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. త్వరలోనే పవన్ కల్యాణ్ తో భేటీ అవుతానని పురందేశ్వరి ప్రకటించారు. పొత్తులపై పార్టీ హైకమాండ్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని, గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమన్నారు. త్వరలో తాను అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానని, ఎక్కడికక్కడ లీడర్లు, కార్యకర్తలతో మీట్ అవుతానని పురందేశ్వరి తెలిపారు.
ఇక YSRCP ప్రభుత్వంపై BJP స్టేట్ చీఫ్ తీవ్రంగా మండిపడ్డారు. APలో ఉన్నన్ని కోర్టు ధిక్కరణ కేసులు ఏ రాష్ట్రంలో లేవని విజయవాడలో అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వానికి కేంద్రం ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూనే ఉందని పురందేశ్వరి గుర్తు చేశారు.