
పుట్టపర్తి సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈనెల 19న మోదీ, 22న రాష్ట్రపతి పుట్టపర్తి చేరుకుంటారు. ఏర్పాట్లపై చర్చించిన CM చంద్రబాబు.. ఉత్సవాల పర్యవేక్షణకు మంత్రుల కమిటీ వేయాలని నిర్ణయించారు. సత్యసాయి సమాధి దర్శనానికి జనం పోటెత్తే అవకాశం ఉండటంతో భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. నవంబరు 13 నుంచి డిసెంబరు 1 వరకు 65 ప్రత్యేక రైళ్లు వేస్తారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయం వరకు 20 బస్సుల్ని నడపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.