తిరుమల శ్రీవారిని ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఒక్కరోజే ఏకంగా 92,238 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. గత నాలుగేళ్లలో ఇంతటి స్థాయిలో జనం రావడం ఇదే ప్రథమం. ప్రయోగాత్మకంగా వెండి వాకిలి నుంచి సింగిల్ క్యూ లైన్ విధానం పాటించడంతో స్వామి వారిని అత్యధిక సంఖ్యలో దర్శించుకోగలిగారు. సర్వదర్శనం క్యూలైన్ ద్వారా 70 వేల మందికి స్వామి దర్శనం కలిగింది.