మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి కోర్టు రిమాండ్ పొడిగించింది. అక్టోబరు 5 వరకు జ్యుడిషియల్ రిమాండ్(Judicial Remand) పొడిగిస్తూ విజయవాడ ACB కోర్టు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. తొలిసారి విధించిన 14 రోజుల గడువు ఈ నెల 22తో ముగియగా.. అడిషనల్ గా ఈ నెల 24 వరకు మరో రెండు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 23, 24 తేదీల్లో ఆయన్ను CID కస్టడీకి అప్పగించారు. రెండు రోజుల కస్టడీలో విచారణ పూర్తయిన తర్వాత బాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరోసారి జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి.. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును వివరాలు అడిగి తెలుసుకున్నారు. జైలులో ఇబ్బంది పెడుతున్నారా.. విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారా.. వసతులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ఎవరూ ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు చెప్పడంతో రిమాండ్ ను అక్టోబరు 5 వరకు పొడిగించారు.