పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. మరో రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉండనున్నారు. వెన్నెముక, కాలు సమస్య బాధిస్తుండటంతో చెన్నై అపోలోలో చేరారు. గతంలో ఈ సమస్యపైనే ఆమె అక్కడే శస్త్రచికిత్స చేయించుకున్నారు. తిరిగి ఆ నొప్పి మళ్లీ తీవ్రం కావడంతో ఇంటి వద్దే ఫిజియోథెరపి చేయించుకున్నారు. అయినా నొప్పి తగ్గక కాలు వాపు రావడంతో శుక్రవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. మంత్రికి మరో రెండు రోజులు చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ఈ కారణంగానే ఆమె ఈ నెల 7న జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు.