
చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఈ నెల 23న అడుగుపెట్టి 11 రోజుల పాటు నిరంతరాయంగా పరిశోధనలు సాగించిన ప్రజ్ఞాన్ రోవర్.. తొలి విడత కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇక కొద్దిరోజుల పాటు ఇది రెస్ట్ తీసుకోనుందని ఇస్రో(ISRO) శాస్త్రవేత్తలు ప్రకటించి ప్రజ్ఞాన్ రోవర్ ను స్లీపింగ్ మోడ్ లోకి పంపించారు. డేటాను పంపే ‘పే లోడ్’ లను ఆఫ్ చేసి రోవర్ ను పార్క్ చేసినట్లు ఇస్రో తెలిపింది. దీంతో ల్యాండర్, రోవర్ ఇక నిద్రలోకి జారుకుంటాయి. జాబిల్లిపై రేపట్నుంచి రెండు వారాల పాటు చీకటి ఉండనున్న దృష్ట్యా పరిశోధనలకు వీలు పడదు. కాబట్టి మళ్లీ వెలుతురు వచ్చే వరకు రోవర్ స్లీప్ మోడ్ లోనే ఉండనుంది. మరో 20 రోజుల నాటికి అంటే ఈ నెల 22న ‘ప్రజ్ఞాన్ రోవర్’ పనిచేసే అవకాశం ఏర్పడుతుందని సైంటిస్టులు స్పష్టం చేశారు. భూమిపైకి రోవర్ చేరవేసిన డేటాను అప్పటివరకు ఎనలైజ్ చేస్తామంటున్నారు.
ఈ నెల 23న మూన్ సౌత్ పోల్ పై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టే సమయంలోనే శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 23న సాధ్యం కాకపోతే మరో 14 రోజుల పాటు రోవర్ లోపలే ఉండిపోతుందని ప్రకటించారు. మళ్లీ సెప్టెంబరు 23 నాడే పనిచేసే అవకాశం ఉంటుందని స్పష్టంగా చెప్పారు. కానీ అనుకున్నట్లుగానే ల్యాండర్ సేఫ్ గా అడుగుపెట్టడం.. అక్కణ్నుంచి క్రమంగా ఇమేజ్ లు, ఇన్ఫర్మేషన్ పంపించడంతో 11 రోజుల పాటు నిరంతరాయంగా పరిశోధనలు పూర్తి చేసింది. ఒక్క క్షణం కూడా వృథా చేయకూడదన్న సంకల్పంతోనే ఇస్రో.. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ను సాధ్యమైనంత మేరకు పరిశోధనలకు ఉపయోగించుకున్నారు. అయితే తొలి విడతగా 14 రోజుల పాటు పనిచేసిన తర్వాత ఇక రెండో విడత పనిచేయకపోవచ్చని అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసుకున్నా సెకండ్ ఫేజ్ కు రెడీగా ఉందంటే.. రోవర్ సోలార్ ప్లేట్లు అద్భుతంగా పనిచేస్తున్నాయన్నమాట. ఈ లెక్కన ఇస్రో శాస్త్రవేత్తలు డబుల్ విజయం సాధించినట్లే. ఇలా తొలి దశ ప్రయోగాలు విజయవంతం కావడంతో మన శాస్త్రవేత్తల్లో ఎనలేని ఆనందం కనిపిస్తున్నది.