
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామి వారి దర్శనానికి 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం శ్రీవారిని 73,137 మంది దర్శించుకున్నారు. 27,490 మంది నిన్న తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమల ఆలయానికి రూ.4.06 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు.
ఆగస్టులో పుష్కరిణి మూసివేత
ఆగస్టు 1 నుంచి 31 వరకు తిరుమలలో పుష్కరిణిని మూసివేయనున్నారు. పైపులైన్ల రిపేర్లు, సివిల్ వర్క్స్ చేపట్టేందుకు గాను నెల రోజుల పాటు పుష్కరిణిని మూసివేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గర పడుతుండటంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు.