తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిట్టకండ్రిగ వద్ద లారీ-కారు ఢీకొని ఆరుగురు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి. మృతులంతా విజయవాడకు చెందినవారుగా గుర్తించారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి మొత్తం ఏడుగురు వ్యక్తులు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. లారీ అదుపు తప్పి బలంగా ఢీకొట్టడంతో కారులోని ఏడుగురిలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వారు వెంకటరమణమ్మ, నరసింహమూర్తి, రమేశ్, అక్షయ, రాజ్యలక్ష్మీ, శ్రీలతగా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలు కావడంతో లోకల్ ఏరియా హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.