
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ(Kashibugga) ఆలయ ధర్మకర్త హరిముకుంద్ పండా నిర్ణయమే ఆశ్చర్యకరంగా నిలిచింది. గతంలో ఆయన తిరుపతి వెళ్లిన సందర్భంలో దర్శనానికి ఇబ్బందులు పడ్డారట. ఆ పరిస్థితి ఇతరులకు రావొద్దన్న ఉద్దేశంతో తనే సొంతం గుడి కట్టించారు. 12 ఎకరాల్లో రూ.20 కోట్లతో ఆలయాన్ని నిర్మించారు. అందుకే ఆ దేవస్థానం శ్రీకాకుళంలో చిన్న తిరుపతి పేరుగాంచింది. దర్శనానికి వచ్చిపోయే దారిలో తలుపులు మూసివేయడంతో తొక్కిసలాట జరిగింది. మరణించిన ఏడుగురూ మహిళలే కావడం అక్కడి పరిస్థితికి అద్దం పట్టింది.