ఆంధ్రప్రదేశ్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎంతటి గొడవలు జరిగాయో చూశాం. స్వయంగా ఎమ్మెల్యేనే EVMను బద్ధలు కొట్టిన వ్యవహారం సంచలనంగా మారింది. దీంతో రేపు నిర్వహించే ఎన్నికల లెక్కింపు కేంద్రం(Counting Centre)లోకి ఎమ్మెల్యేను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్(AP)లో వివాదాస్పదంగా మారిన MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సర్వోన్నత న్యాయస్థానం ఆంక్షలు విధించింది. కౌంటింగ్ సెంటర్లోకి పిన్నెల్లి వెళ్లకూడదని ఆదేశించింది.
EVM ధ్వంసం, హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని అరెస్టు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పోలింగ్ సెంటర్లో EVMలను బద్ధలు కొట్టిన ఘటనపై ఇప్పటికే ఎన్నికల సంఘం సీరియస్ అయింది.