
తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. టోకెన్లు లేని భక్తుల దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. స్వామి వారి సర్వ దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. శనివారం నాడు శ్రీవారిని అత్యధిక సంఖ్యలో 81,655 మంది దర్శించుకున్నారు. 38,882 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారికి 3.84 కోట్ల ఆదాయం వచ్చినట్లు తితిదే(TTD) వర్గాలు తెలిపాయి.
వారాంతం సందర్భంగా శుక్రవారం నుంచే భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం పెద్దయెత్తున కొండపైకి చేరుకుంటున్నారు. అటు కాలినడక మార్గంలోనూ భక్తులు దర్శనం కోసం తరలిరావడంతో తిరుమల జనసంద్రంగా మారింది.