తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో నలుగురు అన్యమత ఉద్యోగులు సస్పెండయ్యారు. క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ EE, బర్డ్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సు, గ్రేడ్-1 ఫార్మాసిస్ట్ తోపాటు శ్రీవేంకటేశ్వర(SV) ఆయుర్వేద ఫార్మసీలో మరొకర్ని సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. హిందూ ధార్మిక సంస్థలో పనిచేస్తూ క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నట్లు గుర్తించారు. TTD విజిలెన్స్ విభాగం నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఈ అంశం గత కొన్ని నెలలుగా వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే పలువురిని రాష్ట్రంలోని ఇతర శాఖలకు పంపించిన TTD.. ఇప్పుడు నలుగురిపై వేటు వేసింది. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com