
భక్తులు ప్రీతిపాత్రంగా భావించే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ద్వార దర్శనం కోసం రేపు (ఈనెల 10) టికెట్లు విడుదల చేయబోతున్నది. రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు, రూమ్ ల కోటా విడుదల కానుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు.. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లతోపాటు రూమ్ ల కోటా విడుదల కానున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారిని దర్శించుకుని ఉత్తర ద్వార దర్శనం ద్వారా తరించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు(Piligrims) పోటీ పడుతుంటారు. ఏకాదశి రోజు నాడు కొండపైకి భారీగా భక్తులు చేరుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వామి వారి దర్శనం కోసం టికెట్లు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తున్నది.