![](https://i0.wp.com/justpostnews.com/wp-content/uploads/2023/11/THIRUMALA-TEMPLE-2-1024x553.jpg?resize=640%2C346&ssl=1)
వైకుంఠ ఏకాదశి నాడు దేవదేవుణ్ని దర్శించుకుని ద్వార దర్శనం చేసుకోవాలని తపించే భక్తుల కోసం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం నేడు టికెట్లు విడుదల చేస్తుండగా.. అందులో రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు, రూమ్ ల కోటా ఉంటాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు.. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లతోపాటు రూమ్ ల కోటా విడుదల చేస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. భారీ స్థాయిలో 2.25 లక్షల టికెట్లను భక్తుల కోసం TTD అందుబాటులో ఉంచుతున్నది. వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారిని దర్శించుకుని ఉత్తర ద్వార దర్శనం ద్వారా తరించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు(Piligrims) పోటీ పడుతుంటారు. ఏకాదశి రోజు నాడు కొండపైకి భారీగా భక్తులు చేరుకుంటారు.
సర్వదర్శనానికి 8 గంటలు
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో శ్రీవారి దర్శనం కలుగుతున్నది. ప్రస్తుతం 13 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. గురువారం నాడు 56,723 మంది దర్శించుకున్నారు. 21,778 మంది తలనీలాలు సమర్పించుకోగా.. రూ.3.37 కోట్ల ఆదాయం వచ్చింది.