ప్రేమ అనేది వ్యామోహమా, లేక అది పిచ్చినా అన్నది వీళ్ల కథను చూసినా అర్థం కాదేమో. అలాంటి ఓ వింత స్టోరీ విజయవాడలో బయటపడింది. ఇద్దరు పురుషులు ప్రేమించుకున్నారు.. కొన్నాళ్లపాటు జంటగా కలిసి తిరిగారు. ఇద్దరు మగవాళ్లు కాబట్టి తిరిగితే బయటివాళ్లు చూస్తే ఏమనుకుంటారోనని భావించారేమో. అందులో ఒకరు.. నువ్వు అమ్మాయిగా మారాలని చెప్పాడు. ఎలాగూ కలిసుండాలని అనుకున్నాం కదా.. నిజంగానే పెళ్లి చేసుకుంటామని నమ్మిన ఆ రెండో వ్యక్తి మొదటి వ్యక్తి(ప్రియుడు) చెప్పిన మాటకు OK అన్నాడు. వారిద్దరినీ చూస్తే… ఏదో చదువు, సంధ్యల్లేవని అనుకోవచ్చు. కానీ ఆ ఇద్దరూ బీఈడీ పూర్తి చేశారు. అలా బీఈడీ చదివే సమయంలో కలిసిన పరిచయం ప్రేమగా మారి, పెళ్లికి దారితీసి చివరకు అమ్మాయిగా మారే వరకు చేరింది. ఈ వింత ఘటన విజయవాడలో వెలుగుచూసింది.
బీఈడీ కాలేజీలోనే నాగేశ్వర్ రావు, పవన్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు. సహజీవనం లాగా కొంతకాలం బాగా కలిసి ఉన్నారు. ఇంకేముంది.. పెళ్లి చేసుకుందామంటూ పవన్ ను నాగేశ్వర్ రావు ఢిల్లీ తీసుకెళ్లాడు. నిజంగానే మనువాడుతాడని నమ్మిన పవన్ కు అవయవ మార్పిడి జరిగిన తర్వాత అర్థమైంది. లగ్గం చేసుకోమంటే తింగరి వేషాలు వేయడం స్టార్ట్ చేశాడు నాగేశ్వర్ రావు. భ్రమరాంబగా మారిన పవన్ ప్రియుణ్ని గట్టిగా నిలదీయడంతో నిన్ను పెళ్లి చేసుకునేది లేదు అంటూ మొండికేశాడు. చేసేది లేక భ్రమరాంబ అలియాస్ పవన్ పోలీసులను ఆశ్రయించింది.