చిత్రవిచిత్రాలకు మారుపేరుగా నిలిచే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరస్పర దాడులు, బీభత్స ఘటనలే కాదు.. ఓటింగ్ లోనూ విచిత్రమైన సంఘటన కనిపించింది. ప్రధాన పార్టీలకు దక్కిన సీట్లు, పోలైన ఓట్లను చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. కోటీ 32 లక్షల ఓట్లు పొందిన YSRCP కేవలం 11 సీట్లు గెలుపొందితే 28.79 లక్షల ఓట్లతో జనసేన దక్కించుకున్న స్థానాలు 21. అత్యధిక(Highest) స్థానాలు గెలుచుకున్న TDPకి, దారుణంగా దెబ్బతిన్న YSRCPకి మధ్య 21 లక్షల ఓట్లు మాత్రమే తేడా.
పార్టీల వారీగా ఓట్లు ఇలా…
పార్టీ | ఓట్లు | పర్సంటేజీ | సీట్లు |
తెలుగుదేశం | 1,53,84,576 | 45.60% | 135 |
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | 1,32,84,134 | 39.37% | 11 |
జనసేన | 28,79,555 | 8.53% | 21 |
భారతీయజనతాపార్టీ | 9,53,977 | 2.83% | 08 |
కాంగ్రెస్ | 5,80,613 | 1.72% | 00 |