ఆగస్టు 2023 నుంచి గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేయాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. విండోస్ 8, విండోస్ 8.1, విండోస్ సర్వర్ 2012 యూజర్లకు ఇకపై గూగుల్ డ్రైవ్ సేవలు అందుబాటులో ఉండబోవని సంస్థ ప్రకటించింది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యూజర్లకు వినూత్న రీతిలో సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం విండోస్ 8 (32-బిట్ వెర్షన్) ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న యూజర్లు… తమ కంప్యూటర్లలో ఓఎస్ ను విండోస్ 10 (64-బిట్ వెర్షన్)కు అప్ గ్రేడ్ చేసుకోవాలని సూచించింది. అయితే గూగుల్ బ్రౌజర్ ద్వారా డ్రైవ్ ను యాక్సెస్ చేసుకోవచ్చని తెలిపింది. యూజర్ డేటా, సైబర్ దాడుల వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని డ్రైవ్ ను నిలిపివేస్తున్నామంది.