వివిధ స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటిస్తూ బిగ్ సేల్ డేస్ ను ఫ్లిప్ కార్ట్ ప్రారంభించింది. ఐఫోన్, శాంసంగ్ సహా ప్రధాన మోడళ్లపై డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తోంది. ఈ తాజా బిగ్ సేల్ ఈవెంట్ ఈ నెల 10 నుంచి 14 వరకు ఐదు రోజుల పాటు కొనసాగనుంది. సమ్మర్ సేల్స్ లో భాగంగా ఫ్లాట్ ధర తగ్గింపుతోపాటు బ్యాంక్ కార్డు ఆఫర్లు, ఎక్చేంజ్ ఆఫర్లు ప్రకటించింది. iPhone13, Samsung Galaxy F23 5జీ, Samsung Galaxy M14 వంటి వేరియేషన్లలో ఫోన్లు తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి.