ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా ఉద్యోగాలకు ఎసరు వస్తుందని భావిస్తున్న తరుణంలో అదే AI ఆధారంగా 100 ప్రాజెక్టులకు పొందినట్లు కాగ్నిజెంట్ తెలిపింది. టెక్నాలజీలో మార్కెట్ లీడర్ గా అవతరించే ప్రయత్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విస్తృతంగా వాడుకోవాలని చూస్తున్న కాగ్నిజెంట్.. దాని ద్వారా 100 ప్రాజెక్టులను సాధించామని ప్రకటించింది. AI డొమైన్ లో 3,000 కంటే ఎక్కువ ఐడియాలను డెలివరీ చేసిందని న్యూజెర్సీకి చెందిన సదరు కంపెనీ తెలియజేసింది. ఇండస్ట్రీ-స్పెసిఫిక్ సొల్యూషన్స్, క్రాస్-ఇండస్ట్రీ యూజ్ కేసెస్(Cross-Industry use cases), ప్రొడక్టివిటీ ఎనేబుల్ మెంట్(Productivity Enablement) విధానాలతో కోడ్ ప్రక్రియను మార్చడం, ఉత్పత్తిలో ఆవిష్కరణలు, సాఫ్ట్ వేర్, కోడింగ్, నాలెడ్జ్ మేనేజ్మెంట్ థీమ్ ల కింద AIని యూజ్ చేస్తున్నామని కాగ్నిజెంట్ CEO రవికుమార్ తెలిపారు. ఈ పద్ధతిలో చేపడుతున్న టెక్నాలజీ… అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ లకు కచ్చితత్వాన్ని ఇవ్వడంతోపాటు సరళీకృతంగా(Easyest) సాగుతూ ఆరోగ్యకర(Healthy) వాతావరణాన్ని సృష్టించి వ్యాపార సంస్థలకు లాభాన్ని అందిస్తుందన్నారు.
Cognizant.com ద్వారా AI స్టోరీ టెల్లింగ్ హబ్ ను ప్రారంభించి ‘బ్లూబోల్ట్ ఇన్నోవేషన్’ బేస్డ్ గా 3,000 కంటే ఎక్కువ ఐడియాల్ని మొత్తంగా 35,000 ఆలోచనలతో ముందుకు సాగుతున్నామని CEO తెలిపారు. మొత్తంగా AI ప్లాట్ ఫామ్ ద్వారా కొత్త ప్రాజెక్టుల్ని అందుకోవడమే కాకుండా క్లయింట్ లకు మంచి ప్రొడక్టివిటీని అందిస్తున్నామన్నారు.