యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)కి చెందిన లులు గ్రూప్ భారత్ లో రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో పలు ప్రాజెక్టులకు ఈ ఫండ్స్ అందజేసి తద్వారా 50,000 మందికి ఉపాధి ఇవ్వడమే లక్ష్యంగా పనుల్ని ప్రారంభిస్తామని ఆ సంస్థ ఛైర్మన్ M.A.యూసుఫ్ అలీ తెలిపారు. ఇప్పటికే దేశంలో రూ.20,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా 22,000 మందికి ఉపాధి కల్పించామన్నారు.
తెలంగాణలో డెస్టినేషన్ షాపింగ్ మాల్స్ కు రూ.3,000 కోట్లు వెచ్చిస్తామని, ఇతర నగరాల్లో సైతం లులు గ్రూప్ రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సంస్థ చీఫ్ వెల్లడించారు.