షేర్ మార్కెట్ల పతనంతో మదుపర్ల(Investors) సంపదంతా ఆవిరై కేవలం 10 సెకన్లలోనే 20 లక్షల కోట్లు హాంఫటయ్యాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు ఊహించని రీతిలో దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ పది నెలల కనిష్ఠ స్థాయికి పడిపోతే.. 2008 తర్వాత ఆసియా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. 3.5% పడిపోయిన సెన్సెక్స్ 4,000 పాయింట్లు, నిఫ్టీ 1,000 పాయింట్ల మేర కోల్పోయాయి. 2020 మార్చి తర్వాత నిఫ్టీకి ఇదే పెద్ద కుదుపు. మాంద్యం భయాలతో డాలర్ తో పోలిస్తే రూపాయి మారక విలువ 19 పైసలు తగ్గి 85.63కు చేరింది. ట్రంప్ టారిఫ్ లతో ప్రపంచ మార్కెట్లన్నీ దారుణంగా తయారయ్యాయి.