ఉద్యోగాల కల్పన(Jobs Creation), 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ, వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లకు ఊరట వంటి పాజిటివ్ అంశాలతో బడ్జెట్ ఉండే అవకాశమున్నట్లు ఆర్థిక వేత్తలు అంటున్నారు. ఆదాయ పన్ను శ్లాబుల్లో గత కొన్నేళ్లుగా ఎలాంటి మార్పులు లేకపోగా.. ఈ బడ్జెట్(Budget)లో అందుకు భిన్నమైన తీరు ఉంటుందన్న ఆశలున్నాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈనెల 22న పార్లమెంటు సమావేశాలు(Sessions) ప్రారంభం కానుండగా.. 23న నిర్మల సీతారామన్ రికార్డు స్థాయిలో ఏడో బడ్జెట్ ప్రవేశపెడతారు. భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ లా మార్చి ఎగుమతుల కేంద్రంగా చేయాలన్నది మోదీ 3.0 లక్ష్యం.
ఎలక్ట్రిక్ వాహనాల(EV)కు ప్రోత్సాహం, రైల్వేల మోడ్రనైజేషన్, లేటెస్ట్ డ్రోన్లతో వ్యవసాయం, విమానాశ్రయాల తరహాలో ఇంటర్-స్టేట్ బస్ టెర్మినల్స్(ISBT), వాతావరణ కాలుష్యం, హెల్త్ కేర్ సెక్టార్ వంటి అంశాలపై మోదీ సర్కారు దృష్టి పెట్టినట్లు ఎక్స్పర్ట్స్ అంటున్నారు.