కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో మీట్ అయిన 50వ GST కౌన్సిల్(Council) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గుర్రపు పందేలు, ఆన్ లైన్ గేమింగ్, క్యాసినోలపై 28 శాతం GST విధించాలని నిర్ణయించింది. కేన్సర్ వ్యాధి నివారణకు ఉపయోగించే మందు డినుటక్సిమాబ్ డ్రగ్ దిగుమతిపై సుంకం ఎత్తివేసింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఫైనాన్స్ మినిస్టర్లు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. మీటింగ్ అనంతరం కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్ వివరించారు.
డినుటక్సిమాబ్ తోపాటు అరుదైన వ్యాధులతో బాధపడే పేషెంట్స్ దిగుమతి చేసుకునే ఫుడ్ పై GST మినహాయింపు లభించనుంది. ప్రైవేటు కంపెనీల ఉపగ్రహ ప్రయోగ సేవలనూ GST నుంచి మినహాయింపునివ్వాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. సినిమా హాళ్లలో సేల్స్ చేసే ఫుడ్, డ్రింక్స్ పై పన్ను 18 పర్సంట్ కాకుండా 5 శాతం విధించడంతోపాటు అప్పిలేట్ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.