
ఇండియన్ మార్కెట్లోకి మూడు కొత్త మోడళ్లను రిలీజ్ చేసేందుకు కియా కంపెనీ రెడీ అవుతోంది. 2025 నాటికి రెండు ఎలక్ట్రిక్ వాహనాలు(EV)లతోపాటు మరో ఎస్వీయూ(SVU)ను నేషనల్ మా ర్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. 2030 నాటికి టోటల్ సేల్స్ లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాటా 20 శాతం ఉంటుందని తెలిపింది. అప్డేటెడ్ వెర్షన్ ఎస్వీయూ SELTOS ను దక్షిణకొరియా దిగ్గజ కంపెనీ కియా(KIA ) అందుబాటులోకి తెచ్చిన సందర్భంగా కొత్త మోడల్స్ ప్రకటన చేసింది. మరో రెండేళ్లలో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్(ICE) మోడల్ తోపాటు మరో రెండు ఎలక్ట్రిక్ వెహికిల్ మోడల్స్ తీసుకురావాలని చూస్తున్నట్లు ఆ కంపెనీ ఇండియా MD, CEO తై-జిన్ పార్క్ తెలిపారు.
ఈ కొత్త మోడళ్లను ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ప్లాంటులోనే ప్రొడక్ట్ చేయనున్నట్లు తెలియజేశారు. కియా కార్లకు దేశీయంగా రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోందని, అందుకు తగిన విధంగా ప్లాంట్ యాన్యువల్ ప్రొడక్ట్ కెపాసిటీని 3.5 లక్షల యూనిట్లకు పెంచాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. న్యూ ఇంటీరియర్స్, సేఫ్టీ ఫీచర్స్ తోపాటు లెవెల్ 2 అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ తో SELTOS రానుంది. ఈ నెల 14న బుకింగ్స్ స్టార్ట్ చేసి 25 నుంచి డెలివరీ చేయనున్నట్లు స్పష్టం చేసింది.