ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకూ క్రమంగా పెరుగుతూనే ఉంది. అన్ని రంగాల్లో దీన్ని తీసుకువస్తుండగా.. ఒడిశాలో ఓ యాంకర్ లా న్యూస్ చదివించి ఆశ్చర్యపరిచారు. టెక్నాలజీ ఆధారంగా న్యూస్ చదివేలా ఆర్టిఫిషియల్ యాంకర్ ను సృష్టించారు. ఆ రాష్ట్రానికి చెందిన OTV వార్తా ఛానల్… లిసా(Lissa) అనే కృత్రిమ యాంకర్ ను సిద్ధం చేసింది. TV జర్నలిజంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ AI న్యూస్ యాంకర్ ను పరిచయం చేశామని ఆ ఛానల్ మేనేజ్ మెంట్ వివరించింది.
ఈ యాంకర్ చాలా లాంగ్వేజెస్ మాట్లాడగలదని, ప్రెజెంట్ ఒడియా, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే యాంకరింగ్ చేస్తోందని ఛానల్ మేనేజ్ మెంట్ తెలిపింది. మనుషులు మాట్లాడే విధంగా స్వచ్ఛమైన ఉచ్చారణ లేకున్నా గూగుల్ అసిస్టెంట్ కంటే మెరుగ్గానే ఉంటుందని ప్రకటించింది.