ప్రయాణికుల కోసం ఎయిరిండియా బంపరాఫర్ ప్రకటించింది. విదేశాలకు వెళ్లాలనుకుంటే బిజినెస్ క్లాస్, ప్రీమియం ఎకానమీ టికెట్లపై ప్రత్యేక డిస్కౌంట్ పొందొచ్చు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య(Middle East) ప్రాంతాలకు ఆఫర్ వర్తిస్తుంది. రిటర్న్ తో కలిపి ప్రీమియం ఎకానమీకి రూ.13,300, బిజినెస్ క్లాస్ కు రూ.34,400 నుంచి ఛార్జీలు ప్రారంభమవుతాయని తెలిపింది. 2025 సెప్టెంబరు 2 నుంచి 7 వరకు చేసుకునే బుకింగ్స్ తో.. 2026 మార్చి 31 వరకు ప్రయాణించవచ్చు. బుకింగ్స్ టైంలో అదనపు ఛార్జీలు ఉండవని.. ఎయిరిండియా వెబ్ సైట్, మొబైల్ యాప్ ను సంప్రదించాలని తెలిపింది.