మొబైల్ యూజర్లలో అలారమ్ ఆందోళన కలిగించింది. నాన్ స్టాప్ గా అలారం మోగడంతో ఏం జరుగుతుందో తెలియక యూజర్లు కంగారు పడ్డారు. మొబైల్ ఫోన్ లో ఓకే అని క్లిక్ చేసే వరకు అలారమ్ మోగుతూనే ఉంది. ఎమర్జెన్సీ అలర్ట్ టెస్టింగ్ లో భాగంగానే పంపినట్లు కేంద్ర ప్రభుత్వ తెలిపింది. ఈ అలర్ట్ ను కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ పంపింది. అయితే నాన్ స్టాప్ అలారం వల్ల ఏమవుతుందోనన్న అయోమయం అందరిలోనూ ఏర్పడింది. ఫోన్లు ఏమవుతాయోనని చాలా మంది ఆందోళన పడ్డారు. ఈ మెసేజ్ ఏదో ఒకసారి కాకుండా కొంతమందికి రెండు మూడు సార్లు… మరికొంతమందికి నాలుగైదు సార్లకు పైగా వస్తూనే ఉంది. ఈ మెసేజ్ రాగానే తొలుత అందరూ అదేదో కాల్ లాగా భావించారు. సడెన్ గా చూసే సరికి అందులో మెసేజ్ కనపడింది. అది చదువుతూనే చాలా మంది స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు. అయితే అందులో భారత టెలికమ్యూనికేషన్ విభాగం అని రాసి ఉన్నా అది రియలా, ఫేకా అన్న అనుమానం కనపడింది.

వివిధ భాషల్లోనూ అలర్ట్స్
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తోపాటు ప్రాంతీయ భాషల్లో ఈ మెసేజ్ అలర్ట్ వచ్చింది. ‘భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా పంపిన మెసేజ్ ఇది.. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి(మరచిపొండి).. మీ వైపు నుంచి ఎలాంటి చర్య అవసరం లేదు.. నేషనల్ డిజాస్టర్ నిర్వహణ అథారిటీ అమలు చేస్తున్న టెస్ట్ పాన్ ఇండియా(TEST Pan-India) ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ కు పంపబడింది.. ప్రజా భద్రత దృష్ట్యా అత్యవసర(Emergency) సమయాల్లో హెచ్చరికల(Warnings)ను అందిస్తాయి’ అన్నది మెసేజ్ సారాంశం


All the best
All the best
For New News Website