ఆకాశమంత పందిరి.. భూదేవంత లోగిలిగా సాగుతున్న వేడుకకు పెళ్లి కొడుకుగా ముస్తాబవుతున్న ముకేశ్ అంబానీ తనయుడు అనంత్.. తమ కుటుంబ సభ్యులతో కలిసి అతిథుల్ని ఆహ్వానిస్తున్నారు. రాధిక మర్చంట్ తో ఈ నెల 12 వివాహం(Wedding) జరగనుండగా.. ముందస్తు వేడుకల్లో ముంబయిలోని తమ నివాసమైన అంటిలియాలో విందు(Dinner) ఏర్పాటు చేశారు.
ఆరెస్సెస్ చీఫ్ కు…
ఈ డిన్నర్ కు RSS చీఫ్ మోహన్ భగవత్ అటెండ్ అయ్యారు. ముకేశ్-నీతా దంపతులతోపాటు పెళ్లికొడుకు అనంత్ సైతం ఆయనకు సాదర స్వాగతం(Welcomed) పలికారు. భగవత్ కు అనంత్ అంబానీ పాదాభివందనం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. ఈ వివాహ వేడుకకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతుండగా.. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమా(Social Media)ల్లో సందడి చేస్తున్నాయి.