రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ కీలకాధికారులతోపాటు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ(SEBI) నిషేధం విధించింది. కంపెనీ నుంచి నిధులు మళ్లించడంపై రూ.25 కోట్ల పెనాల్టీ విధిస్తూనే 5 సంవత్సరాల పాటు నిషేధించింది. రిలయన్స్ హోం ఫైనాన్స్(RHFL)ను మార్కెట్ నుంచి 6 నెలల పాటు బ్యాన్ చేస్తూ రూ.6 లక్షల ఫైన్ వేసింది.
RHFL నుంచి ఇతర సంస్థలకు రుణాల పేరిట మళ్లించేందుకు మోసపూరిత పథకం తయారు చేసినట్లు SEBI గుర్తించినట్లు 222 పేజీల రిపోర్టులో తెలిపింది. RHFLతోపాటు మరో 24 కంపెనీలపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలిచ్చేవరకు ఏ లిస్టెడ్ కంపెనీ కానీ లేదా స్టాక్ మార్కెట్లు, పబ్లిక్ కంపెనీల ద్వారా నిధులు సేకరించొద్దని తెలిపింది. అనిల్ తోపాటు మరో 24 మందిపైనా వేటు పడింది.