ప్రజల్లో ఉన్న డిమాండ్ మేరకు భారత్ లో ఐఫోన్లు(iPhones) రెట్టింపు కానున్నాయి. ఈ ఏడాది 25-30 మిలియన్లు ఉత్పత్తి చేయాలని ఆ కంపెనీ ఫాక్స్ కాన్ నిర్ణయించింది. ఈ తైవాన్ సంస్థ ఇప్పటికే బెంగళూరులో ఆపరేషన్స్ ప్రారంభించింది. గతేడాది భారత్ లో 12 మిలియన్ల ఫోన్లు తయారయ్యాయి. తాజా పెంపుతో 12-16% నుంచి 21-25 శాతానికి మొబైళ్లు చేరుకుంటాయి. 300 ఎకరాల బెంగళూరు సెంటర్ అందుబాటులోకి వస్తే గతేడాది కన్నా డబుల్ ఫోన్లు మార్కెట్లోకి వస్తాయి. చైనా తర్వాత ఇదే అతి పెద్ద సెంటర్. ఇప్పటికే హైదరాబాద్ లో ఎయిర్ పాడ్స్(AirPods) కేంద్రం నడుస్తోంది. వీటన్నింటి అసెంబ్లింగ్ అంతా చెన్నై శ్రీపెరుంబుదూర్లోని క్యాంపస్ లో చేపడతారు.