సింగరేణిలో పనిచేసే ఉద్యోగులకు ఎరియర్స్ విడుదలయ్యాయి. 11వ వేజ్ బోర్డుకు సంబంధించి రూ.1,450 కోట్లను పర్సనల్, ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్.బలరామ్ రిలీజ్ చేశారు. సింగరేణి భవన్ నుంచి మధ్యాహ్నం ఆన్ లైన్ ద్వారా వీటిని విడుదల చేశారు. దీంతో ఎంప్లాయిస్ అకౌంట్లలో ఈరోజు మధ్యాహ్నమే డబ్బులు జమయ్యాయి. 39,413 మంది ఉద్యోగుల(Employees)కు గాను రూ.1,450 కోట్లను రిలీజ్ చేస్తూ ఆదేశాలిచ్చారు.
ఇప్పుడు అందజేసిన ఎరియర్స్ ను యావరేజ్ గా పరిగణలోకి తీసుకుంటే ఒక్కో ఉద్యోగికి రూ.3,70,000 అందుతున్నాయి. దసరా, దీపావళికి సంబంధించిన బోనస్ చెల్లింపులకు కూడా సింగరేణి సిద్ధంగా ఉందని ఉన్నతాధికారులు తెలిపారు.