విస్కీ ఎంత పాతబడితే(Old) అంత మంచిదంటారు. కానీ ఇదే సూత్రాన్ని(Logic) వైన్స్ ల ఓనర్లు బీర్లకు వర్తింపజేస్తున్నట్లే కనపడుతున్నది. బీర్లకు ఎక్స్ పైరీ డేట్ ఉండగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని గడువులోపే అమ్మాలి. ఇప్పటిదాకా మద్యాన్ని అక్రమంగా అమ్మడమే చూశాం కానీ.. వైన్స్ ల్లో ఇప్పుడో కొత్త కోణం బయటపడింది. కాలం చెల్లిన(Expiry) బీర్లను అమ్ముతూ కొందరు వైన్స్ ల యజమానులు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటిదే తాజాగా వరంగల్ లో వెలుగుచూసింది. కాలం చెల్లిన బీర్లను అమ్మడాన్ని పోలీసులు గుర్తించారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నాయి. మద్యం దుకాణాలకు వెళ్లి బీర్ ఇవ్వమనగానే ఏది ఇచ్చినా తీసుకుని వెళ్లే అలవాటే ఉంటుంది కానీ.. దాన్ని సూక్ష్మంగా అబ్జర్వ్ చేసే అవకాశం ఉండదు. వైన్స్ ల నుంచి తెచ్చిన బీర్లు ఓపెన్ చేసే తాగేముందు ఎక్స్ పైరీ డేట్ చూసుకోవడమే మంచిదంటున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అధికారులు దాడులకు దిగితే మాత్రం… పెద్దయెత్తున కాలం చెల్లిన బీర్లు దొరుకుతాయనేది కాదనలేని నిజం. వాస్తవానికి బీర్ల కాల పరిమితి(Shelf Life) 6 నెలలు మాత్రమే ఉంటుంది. 6 నెలల గడువుతోనే కంపెనీలు బీర్లను తయారు చేస్తుండగా.. ఇందుకు ప్రత్యేకంగా ఎక్సైజ్(Excise) రూల్స్ ఉన్నాయి.
బీర్లను కొంతకాలం నిల్వ చేయాల్సి ఉండగా.. ఆలోపే డేట్ ముగిసిపోతే వాటిని పడేయాల్సిందే. కానీ తాము తెచ్చుకున్న స్టాక్ పడేస్తే లాస్ అన్న ఉద్దేశంతో డేట్ క్లోజ్ వాటిని అమ్ముతుంటారు వైన్స్ ఓనర్లు. ఈ బీర్ల గడువును 6 నెలలకు బదులు 9 నెలలకు పెంచాలని అబ్కారీ శాఖ రిపోర్ట్ తయారు చేసింది. జనరల్ గా మద్యం దుకాణాల్లో ఎప్పటికప్పుడు బీర్లు అమ్ముడవుతాయి. కానీ వానాకాలం, చలికాలంలో మాత్రం లిక్కర్ సేల్స్ ఎక్కువగా ఉంటాయి. బీర్లకు బదులు IML అమ్ముడుపోవడంతో ఎండాకాలం మినహా ఆ రెండు సీజన్లలో బీర్ల స్టాక్ పేరుకుపోతుంటుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో బీర్ల కాలపరిమితి 9 నెలలుగా ఉంది. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో 9 నెలల గడువుతోనే బీర్లు ప్రొడక్ట్ అవుతున్నాయి. ఈ విధానాన్ని తెలంగాణలోనూ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. ఇది సరే.. ఇక గడువు ముగిసిన బీర్లను అమ్మితే వైన్స్ లను సీజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఎక్సైజ్ అధికారులు వీటిపై ఏ మేరకు దృష్టిపెడతారో చూడాలి.