మైక్రోసాఫ్ట్(Microsoft) అధినేత బిల్ గేట్స్ సంపద భారీగా తగ్గిపోయింది. వారంలోనే 30% కోల్పోవడంతో టాప్-10లో చోటు దక్కలేదు. గతంలో ఆయన వద్ద CEOగా పనిచేసిన స్టీవ్ బామర్(Steve Ballmer) గేట్స్ ను మించిపోయారు. గతవారం గేట్స్ సంపద 175 బి.డాలర్లు(రూ.14.9 లక్షల కోట్లు) ఉంటే ఇప్పుడది 124 బి.డా.కు పడిపోయింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో ఆయన స్థానం 12. స్టీవ్ బామర్ సంపద 172 బి.డా.కు చేరుకోవడంతో ఆయన టాప్-5గా ఉన్నారు. గేట్స్ ఫౌండేషన్ కు 108 బి.డా. కేటాయించడం, 2045 నాటికి 200 బి.డా. ఇవ్వాలని భావించడంతో ఆయన సంపద తగ్గింది.