BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ దూసుకుపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డుల్ని(Milestone) క్రియేట్ చేశాయి. సెన్సెక్స్ 79,000 మార్క్ ను దాటితే, నిఫ్టీ 23,900కి చేరుకుంది. సెన్సెక్స్ ఉదయం 10:24 గంటలకు 78,926 వద్ద ట్రేడ్ అయి 252 పాయింట్ల లాభంతో 79,013.76కు చేరుకుంది.
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు తన దూకుడును కొనసాగించగా, 24,000 పాయింట్ల దిశగా నిఫ్టీ కొత్త రికార్డులు సృష్టించేలా ట్రెండ్ కంటిన్యూ చేసింది. కేంద్ర బడ్జెట్ పై ఆశాజనక(Optimism) అంచనాలు, విదేశీ పెట్టుబడుల వెల్లువ(Inflows), దేశీయ ఆర్థిక వృద్ధికి ఢోకా లేదన్న పరిణామాలతో స్టాక్ మార్కెట్లు అప్ ట్రెండ్(Up Trend)ను కొనసాగిస్తూనే ఉన్నాయి.
లాభాల్లో..: అల్ట్రాటెక్ సిమెంట్, JSW స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్
నష్టాల్లో..: ITC, HDFC బ్యాంక్, TCS, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్